Shakib Al Hasan : మరోసారి వివాదాల్లోకి.. అభిమానిపై చేయి చేసుకున్న బంగ్లా ఆల్‌రౌండర్
ఆటతోనే కాకుండా.. వివాదాలతోనూ వార్తల్లోకి ఎక్కుతుంటాడు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ హల్ హసన్ (Shakib Al Hasan). తాజాగా ఓ అభిమానిపై అతడు దురుసుగా ప్రవర్తించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ హల్ హసన్(Shakib Al Hasan) తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. పలుసార్లు మైదానంలోనే అతడు అసహనానికి గురైన సందర్భాలు ఉండగా.. ఈసారి మైదానం బయట అలాంటి ఘటన చోటుచేసుకుంది. వందలాది మంది మధ్యే ఓ అభిమానిని క్యాప్‌తో కొడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో షకీబ్ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
చట్టోగ్రామ్‌లో ఓ ప్రచార కార్యక్రమంలో షకీబ్ పాల్గొన్నాడు. దీంతో అతడిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి పోటెత్తారు. పెద్దసంఖ్యలో అతడిని చుట్టుముట్టారు. దీంతో సహనం కోల్పోయిన ఈ క్రికెటర్.. క్యాప్‌తో ఓ అభిమానిని కొట్టాడు.
షకీబ్‌కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. మైదానంలో చాలాసార్లు అంపైర్లతో గొడవకు దిగిన సందర్భాలున్నాయి. తోటి ఆటగాళ్లతో సరిగ్గా ఉండడనే వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు, షకీబ్‌కు తమీమ్ ఇక్బాల్, మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లతో గొడవలు ఉన్నట్లు గత నెలలో ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడే చెప్పడం గమనార్హం.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు: ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 210/2 (71 ఓవర్లు)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!