IPL 2021:అందుకే ఆ విషయాలను మా ఆటగాళ్లకు చెప్తాం: షకీబ్‌ హల్‌ హసన్‌

సెప్టెంబరు 19న ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-14 సీజన్‌ పున:ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌ మొదలవనుంది. కాగా, ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడటం ద్వారా  పొందిన అనుభవాలను తనతోపాటు 

Published : 13 Sep 2021 01:24 IST

(Photo: KKR Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: సెప్టెంబరు 19న ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-14 సీజన్‌ పున:ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌ మొదలవనుంది. కాగా, ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పొందిన అనుభవాలను తనతోపాటు  ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌.. తమ ఆటగాళ్లతో పంచుకుంటామని  బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ హల్ హసన్‌  అన్నాడు. ఇలా చేయడం టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. 

‘ఐపీఎల్ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మేం యూఏఈ వాతావరణ పరిస్థితుల్లో గడుపుతాం. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడతాం. ఆ అనుభవాలను మా జాతీయ జట్టు ఆటగాళ్లతో పంచుకుంటాం. ఇతర ఆటగాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాం. టీ20 ప్రపంచకప్‌ గురించి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారనే విషయాలను మా ఆటగాళ్లకు చెప్తాం’అని షకీబ్‌ అన్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో షకీబ్‌ హల్‌ హసన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్నాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని