Shane Warne: షేన్‌వార్న్‌ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడిన స్నేహితులు

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌ను బతికించడానికి ముగ్గురు స్నేహితులు విశ్వ ప్రయత్నాలు చేశారని, సుమారు 20 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు తాపత్రయం పడ్డారని థాయ్‌లాండ్‌ పోలీసులు మీడియాకు తెలిపారు...

Updated : 05 Mar 2022 10:37 IST

బ్యాంకాక్‌: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌ను బతికించడానికి ముగ్గురు స్నేహితులు విశ్వ ప్రయత్నాలు చేశారని.. సుమారు 20 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని థాయ్‌లాండ్‌ పోలీసులు మీడియాకు తెలిపారు. వార్న్‌ కొద్ది రోజులుగా ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సామూయ్‌లోని ఓ ప్రైవేటు విల్లాలో బసచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్‌ పోలీసులు అక్కడ ఏం జరిగిందో వివరించారు.

‘షేన్‌వార్న్‌ భోజనానికి రాకపోవడంతో స్నేహితుల్లోని ఓ వ్యక్తి తొలుత అతడి గదికి వెళ్లి చూడగా అప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే స్పందించిన ముగ్గురు స్నేహితులు వార్న్‌ గుండెపోటుకు గురై ఉంటాడని భావించి ఛాతి భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఆస్పత్రికి తరలించాక వైద్యులు మళ్లీ సీపీఆర్‌ నిర్వహించినా ఫలితం లేకపోయింది’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని