Shane Warne: విధి అంటే ఇదేనేమో! క్రికెటర్‌ మృతికి సంతాపం తెలిపిన కొన్ని గంటలకే!!

మృత్యువు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో.. ఆత్మీయులను ఏ రూపంలో దూరం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ విషయంలోనూ అదే జరిగింది.

Published : 05 Mar 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మృత్యువు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో.. ఆత్మీయులను ఏ రూపంలో దూరం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ విషయంలోనూ అదే జరిగింది. తమ దేశానికి చెందిన క్రికెటర్‌ మృతికి సంతాపం తెలిపిన కొన్ని గంటలకే వార్న్‌ మృతి చెందడం క్రీడా లోకాన్ని కలచివేసింది. అతడు చివరగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ (74) క్వీన్స్‌ల్యాండ్‌లో శుక్రవారం కన్నుముశారు. ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘రాడ్ మార్ష్ మృతి చెందాడన్న వార్త వినడం బాధాకరం. క్రికెట్‌లో ఆయనో లెజెండ్‌. చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రేరణ. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నా’’ అని షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చేసిన సరిగ్గా 12 గంటలకే వార్న్‌ మరణించాడు. వార్న్‌ మరణ వార్త అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. బహుశా విధి అంటే ఇదేనేమో అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts