వార్న్‌ మిత్రుడిగా మారిపోయారు: కుల్‌దీప్‌

టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్నప్పుడు అనిల్‌కుంబ్లే తనకు షేన్‌వార్న్‌తో పరిచయం చేశారని మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. తన బౌలింగ్‌పై వార్న్‌ ప్రభావం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఆయన తనకు మార్గనిర్దేశం చేస్తారని వెల్లడించాడు....

Published : 14 Aug 2020 02:08 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్నప్పుడు అనిల్‌కుంబ్లే తనకు షేన్‌వార్న్‌తో పరిచయం చేశారని మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. తన బౌలింగ్‌పై వార్న్‌ ప్రభావం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఆయన తనకు మార్గనిర్దేశం చేస్తుంటారని వెల్లడించాడు.

‘పుణెలో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా షేన్‌వార్న్‌ను కలిశాను. అప్పుడు అనిల్‌ కుంబ్లే కోచ్‌. వార్న్‌ను కలవాలని అనుకుంటున్నట్టు కుంబ్లే సర్‌తో చెప్పాను. ఆయన్ను కలవగానే పదినిమిషాల వరకు మాట్లాడలేకపోయాను. కుంబ్లే, వార్న్‌ ఏవో విషయాలు చర్చించుకున్నారు. వాటిని వింటూ అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నా ప్రణాళికలు, బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తానో వార్న్‌కు చెప్పాను. నేను చాలా ఆలోచిస్తున్నానని అప్పుడాయన నాతో అన్నారు’ అని కుల్‌దీప్‌ అన్నాడు.

‘ఆ తర్వాత వార్న్‌ను  ఎన్నోసార్లు కలిశాను. ఒక కోచ్‌లాగా ఆయన నాకు మార్గనిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఆయన నాకు మిత్రుడిగా మారిపోయారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆయనతో ఎంతో సమయం గడిపాను. ఎప్పుడు సలహాలు అవసరమైన ఆయన నాకు సహాయం చేస్తారు. ఫోన్‌కాల్స్‌, ఛాటింగ్‌ ద్వారా సందేహాలు తీర్చుకుంటాను. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన్ను కలుస్తానని, మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నిరంతరం ఆయనతో మాట్లాడటం అంటే అది నాకు గొప్ప విషయమే’ అని కుల్‌దీప్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని