Published : 22 Oct 2021 21:36 IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లే ఫేవరెట్‌: షేన్‌వార్న్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో రేపటి నుంచి సూపర్‌ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఈ మెగా టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ కూడా తన అంచనాను బయటపెట్టాడు. టీ20 ప్రపంచకప్‌ 2021 టైటిల్‌ విజేతగా నిలిచేందుకు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయని షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. మరో వైపు, ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ఏ విధంగానూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించాడు. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ జట్ల నుంచి మిగతా జట్లు గట్టి పోటీని ఎదుర్కొంటాయని వార్న్‌ పేర్కొన్నాడు.

‘ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు టైటిల్‌ బరిలో నిలుస్తాయని అనుకుంటున్నా. ఐసీసీ ఈవెంట్లలో  న్యూజిలాండ్‌ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఆ జట్టులో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. పాకిస్థాన్‌, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు.  ఇక, టీమ్‌ఇండియా విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి జోరు మీదుంది. ఆదివారం (అక్టోబరు 24)న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని