Shane Warne: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమర్థించలేనిది: షేన్‌వార్న్‌

ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధమే. దీని గురించి ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం, దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాడు...

Published : 05 Mar 2022 12:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధమే. దీని గురించి ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం, దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చనిపోవడానికి వారం రోజుల ముందు ఈ యుద్ధ వాతావరణం గురించి ఓ ట్వీట్‌ చేశాడు. అందులో ఉక్రెయిన్‌ ప్రజలకు ప్రపంచం మొత్తం అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తూనే రష్యా దురక్రమణపై మండిపడ్డారు.

‘సమర్థించలేని విధంగా రష్యా బలగాలు సాగిస్తోన్న యుద్ధంలో ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌ ప్రజల వెంటే ఉంది. అక్కడ కనిపిస్తోన్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉక్రెయిన్‌లోని నా మిత్రుడు ఆండ్రీ షివెంకో, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని వార్న్‌ ఉక్రెయిన్‌ ఫుట్‌బాల్‌ మేనేజర్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని