గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 253/6

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధించకపోయినా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు...

Updated : 17 Jan 2021 10:49 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు సాధించకపోయినా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు. 186/6తో నిలిచిన జట్టును వాషింగ్టన్‌ సుందర్‌(38*), శార్దూల్‌ ఠాకుర్‌(33*) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 67 పరుగుల అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే రెండో సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలోనే టీ విరామ సమయానికి భారత్‌ 87 ఓవర్లలో 253/6 స్కోర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. 

ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని