
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ జట్టులో శార్దూల్ ఠాకూర్‌కి చోటు
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కింది. గాయపడ్డ స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే అక్షర్‌ను స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో ఉంచింది. అక్టోబరు 17 నుంచి ప్రపంచకప్ మొదలుకానున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి
స్టాండ్-బై ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
ఇక మ్యాచ్ సన్నాహాల్లో సహకరించడానికిగాను అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్‌ను టీమ్‌తోపాటు బయో బబుల్‌లో ఉండాలని బీసీసీఐ సూచించింది. వీరంతా ఇప్పటికే ఐపీఎల్ ఆడుతున్న విషయం తెలిసిందే.