టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ పాదానికి సర్జరీ.. ఆటకు 3 నెలలు దూరం

టీమ్‌ఇండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌కు లండన్‌లో సర్జరీ జరిగింది.

Published : 12 Jun 2024 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పాదానికి సర్జరీ జరిగింది. దీంతో అతడు కనీసం మూడు నెలలపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. లండన్‌లో తన పాదానికి సర్జరీ విజయవంతంగా జరిగినట్లు అతడు ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.

పాదానికి సర్జరీ చేయించుకోవడం ఐదేళ్లలో ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో గాయం తిరగబెట్టింది. అయినప్పటికీ అతడు రంజీ ట్రోఫీలో గొప్పగా రాణించాడు. ముంబయి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నైకి ఆడిన శార్దూల్‌.. 9 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఇక గ్రేడ్‌ సి కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ కావడంతో శార్దూల్‌ చికిత్స ఖర్చులన్నీ బీసీసీఐ భరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని