
కొడుక్కి గుర్రపు స్వారీ నేర్పిన గబ్బర్
ఇంటర్నెట్‌డెస్క్: లాక్‌డౌన్ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్లలో శిఖర్ ధావన్ ముందున్నాడు. ఆడుతూ.. పాడుతూ.. కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో ఎన్నడూ లేనంతగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సరదా.. సరదా విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.
తాజాగా తన కుమారుడు జొరావర్‌కు గుర్రపు స్వారీ నేర్పిస్తున్న వీడియోను టీమ్‌ఇండియా గబ్బర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘గుర్రపు స్వారీ చేయడంలో ఉన్న మజాని ఆస్వాదించడం జొరావర్‌కు నేర్పిస్తున్నాను?? తన కొత్త మిత్రుడితో సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేశాడు’ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం సమయం దొరకడంతో గబ్బర్ తన కొడుక్కి అన్నీ నేర్పిస్తున్నాడు. ఇంటి పనుల్లో సాయం చేయిస్తున్నాడు. సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నాడు. ఇంకా పరుగెత్తిస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ట్రిమ్మర్‌తో తన జట్టును స్టైలిష్‌గా చేయించుకున్నాడు. మొన్న ఓ పంజాబీ పాటకు ఇద్దరూ కలిసి చిందులు వేశారు. తన సతీమణి ఆషేయాను డాన్స్ చేయాలని కోరగా ఆమె నిరాకరించింది. దాంతో ‘భార్యను ఒప్పించాలంటే కొడుకు సహాయం ఉండాల్సిందే’ అని సోషల్ మీడియాలో చమత్కరించాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.