ప్చ్‌..! గబ్బర్‌ సెంచరీ మిస్‌

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6)ను దురదృష్టం వెంటాడింది. 2 పరుగులు తేడాతో శతకం చేజారింది. అతడు ఆరోసారి 90ల వద్ద ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 38.1వ బంతికి ఇయాన్‌ మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్టోక్స్ వేగం తగ్గించి షార్ట్‌పిచ్‌లో వేసిన..

Published : 23 Mar 2021 16:52 IST

98 వద్ద బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔట్‌

పుణె: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6)ను దురదృష్టం వెంటాడింది. 2 పరుగుల తేడాతో శతకం చేజారింది. అతడు ఆరోసారి 90ల వద్ద ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 38.1వ బంతికి ఇయాన్‌ మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్టోక్స్ వేగం తగ్గించి షార్ట్‌పిచ్‌లో వేసిన బంతిని ధావన్‌ మిడ్‌వికెట్లో పుల్‌ చేశాడు. అక్కడే ఉన్న మోర్గాన్‌ ఏ మాత్రం తప్పు చేయలేదు. బంతిని చక్కగా ఒడిసిపట్టాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ధావన్‌ మంచి టచ్‌లో కనిపించాడు. ఫామ్‌లోకి తిరిగొచ్చాడు. మొదట్లో ఆచితూచి ఆడిన అతడు చక్కని బౌండరీలతో అలరించాడు. 68 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. రోహిత్‌తో తొలి వికెట్‌కు 64, కోహ్లీతో రెండో వికెట్‌కు 105 పరుగులు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అర్ధశతకం తర్వాత వేగం పెంచిన ధావన్‌ శతకానికి చేరువయ్యాడు. కానీ దురదృష్టం వెంటాడటంతో 18వ శతకం చేజార్చుకున్నాడు. నిరాశగా మైదానం వీడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని