Shikhar Dhawan: విడిపోయిన శిఖర్‌ ధావన్‌-అయేషా ముఖర్జీ జంట

టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ జంట విడిపోయింది. ఈ మేరకు అయేషా ముఖర్జీ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 

Updated : 08 Sep 2021 23:17 IST

దిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్, అయేషా ముఖర్జీ జంట విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ జంట ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. ‘‘రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని’’ అయేషా పేర్కొంది. విడాకుల విషయంపై శిఖర్‌ ధావన్‌ ఇంతవరకు స్పందించలేదు. మెల్‌బోర్న్‌ బాక్సర్‌ అయిన అయేషా ముఖర్జీతో ధావన్‌ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయేషా ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్‌ ధావన్‌తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు(జొరావర్‌) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్‌ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. 
 
అయేషా విడాకుల విషయంపై ఇన్‌స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేశారు. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తివంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డానని, జీవితంలో విఫలమైనట్లు, తప్పుచేస్తున్నట్లుగా అనిపించిందని తెలిపారు. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు భావించానని ఆమె పేర్కొన్నారు. ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సమయంలో తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని అయేషా పేర్కొంది.  

ఇక శ్రీలంకతో జరిగిన పరిమిత వన్డే, టీ20 సిరీస్‌లకు ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్‌.. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టును బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకో రెండో ఓపెనర్‌ కోసం రాహుల్‌తో ధావన్‌ పోటీపడాల్సి వస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని