Shikhar Dhawan: కివీస్‌పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్‌ ధావన్‌

టీమ్‌ఇండియా వన్డే జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్‌ కివీస్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రికార్డులపరంగా భారత దిగ్గజాల సరసన చేరాడు.

Updated : 25 Nov 2022 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్‌ (72) తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (50)తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్‌ మరో మైలురాయిని అందుకొన్నాడు. ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్‌ - A క్రికెట్‌లో 12వేల పరుగుల మార్క్‌ను తాకిన ఏడో భారత బ్యాటర్‌గా అవతరించాడు. ధావన్‌ 297 మ్యాచుల్లో 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 167 అంతర్జాతీయ వన్డేలు ఉన్నాయి. 17 శతకాలు, 39 అర్ధశతకాలతో 6,744 పరుగులు చేశాడు. 

శిఖర్ ధావన్‌ కంటే ముందు ఆరుగురు బ్యాటర్లు ఈ రికార్డును సాధించారు. సచిన్‌ తెందూల్కర్ అందరి కంటే ముందున్నాడు. కెరీర్‌లో 551 మ్యాచుల్లో 21,999 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సౌరభ్ గంగూలీ (437 మ్యాచుల్లో 15,622), రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచుల్లో 15,271), విరాట్ కోహ్లీ (296 మ్యాచుల్లో 13,786), మహేంద్ర సింగ్ ధోనీ (423 మ్యాచుల్లో 13,353), యువరాజ్‌ సింగ్‌ ( 423 మ్యాచుల్లో 12,633) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని