Dhawan-Jaddu: జడ్డూతో గబ్బర్‌ స్పెషల్‌ రీల్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌!

శిఖర్ ధావన్‌.. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్‌తో హంగామా చేస్తుంటాడు. తాజాగా భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో...

Updated : 24 Sep 2022 16:30 IST

(ఫొటో సోర్స్‌: ధావన్‌ ఇన్‌స్టాగ్రామ్)

ఇంటర్నెట్ డెస్క్‌: శిఖర్ ధావన్‌.. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్‌తో హంగామా చేస్తుంటాడు. తాజాగా భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో కలిసి చేసిన రీల్‌ వైరల్‌గా మారింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా మోకాలి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లిన ధావన్‌.. డ్యాన్స్‌ చేస్తూ ఉంటాడు. అయితే జడేజా కూడా బాలీవుడ్‌ డైలాగ్‌కు లిప్‌ సింక్‌ చేస్తాడు. ఈ వీడియోను ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 6 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. 

వీడియోలో.. ‘‘అతడికి త్వరగా పెళ్లి చేయండి.. బాధ్యతలు పెరిగితే దారిలోకి వస్తాడు’’ అని జడ్డూ డైలాగ్‌ చెప్పినా సరే ధావన్‌ మాత్రం డ్యాన్స్ ఆపడు. ‘‘కాదు కాదు. ఇప్పుడు కాదు. కొంచెం ఆగండి’ అని ధావన్‌ సరదాగా వీడియోను పోస్టు చేస్తూ ట్యాగ్‌ చేశాడు. ధావన్‌ - జడ్డూ వీడియోపై టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్‌ స్పందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని