Shikhar Dhawan: పంజాబ్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌.. మయాంక్‌పై వేటు

పంజాబ్‌ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ను ఎంచుకుంది. ఇప్పటివరకు సారథిగా ఉన్న మయాంక్‌ అగర్వాల్‌పై వేటు వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 04 Nov 2022 22:02 IST

దిల్లీ: భారత టీ20 లీగ్‌లో ఒకటైన పంజాబ్‌ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌ను మార్చేసింది. శిఖర్‌ ధావన్‌కు టీమ్‌ పగ్గాలను అప్పగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. రాబోయే సీజన్‌ (2023) నుంచి ధావన్‌ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. గత సీజన్‌(2022)లో కెప్టెన్సీ వహించి ఆకట్టుకోలేకపోయిన మయాంక్‌ అగర్వాల్‌పై వేటు వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇదివరకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ను లఖ్‌నవూ కొనుగోలు చేయడంతో.. పంజాబ్‌ యాజమాన్యం జట్టు బాధ్యతలను మయాంక్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడి సారథ్యంలోని టీమ్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 16.33 సగటుతో మయాంక్‌ ప్రదర్శన సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో యాజమాన్యం అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇదే సీజన్‌లో గబ్బర్‌ మాత్రం 14 మ్యాచ్‌ల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని