Shikhar Dhawan: ఒక్క ఇన్నింగ్స్‌.. ధావన్‌ నాలుగు రికార్డులు

పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ టీ20 లీగ్‌లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతరాత్రి చెన్నైతో ఆడిన తన 200వ మ్యాచ్‌లో 88 పరుగులు సాధించి...

Published : 26 Apr 2022 09:08 IST

ముంబయి: పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ టీ20 లీగ్‌లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతరాత్రి చెన్నైతో ఆడిన తన 200వ మ్యాచ్‌లో 88 పరుగులు సాధించి ఈ టోర్నీలో మొత్తం 6,086 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (6,402) తర్వాత ఈ మైలురాయి చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు ధావన్‌కు ఇది 200వ మ్యాచ్‌ కావడంతో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గానూ రికార్డు పుటల్లోకెక్కాడు.

ఇదే మ్యాచ్‌లో ధావన్‌ మరో రికార్డులో కోహ్లీని అధిగమించడం విశేషం. 9 పరుగుల వద్ద చెన్నై జట్టుపై అత్యధిక పరుగులు (1,022) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇది వరకు విరాట్‌ 28 ఇన్నింగ్స్‌ల్లో చెన్నైపై 949 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు ధావన్‌ అతడిని వెనక్కినెట్టాడు. వీటితో పాటు ధావన్‌ మొత్తం టీ20 క్రికెట్‌లో 9వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. విరాట్‌ ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 10,392 పరుగులు చేయగా, రోహిత్‌ 10,048 పరుగులతో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని