Shimron Hetmyer: బయోబబుల్ వీడిన రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మెయర్

రాజస్థాన్‌ ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మెయర్‌ ఆదివారం ఉదయం బయోబబుల్‌ వీడాడు. అతడి సతీమణి నిర్వాని తొలి బిడ్డకు జన్మనిస్తున్న సందర్భంగా ఈ తెల్లవారుజామున గుయానా...

Published : 08 May 2022 18:28 IST

(Photo: Shimron Hetmyer Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మెయర్‌ ఆదివారం ఉదయం బయోబబుల్‌ వీడాడు. అతడి సతీమణి నిర్వాని తొలి బిడ్డకు జన్మనిస్తోన్న సందర్భంగా ఈ తెల్లవారుజామున గుయానాకు బయలుదేరి వెళ్లినట్లు రాజస్థాన్‌ టీమ్‌ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లంతా అతడికి శుభాకాంక్షలు చెప్పి పంపించారు. అయితే, హెట్‌మెయర్‌ త్వరలోనే తిరిగివస్తాడని ఆ జట్టు పేర్కొంది. ప్రస్తుతం రాజస్థాన్ 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా ప్లేఆఫ్స్ బెర్తుకు చేరువైంది. హెట్‌మెయర్‌ వచ్చేలోపు ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరుతుందా లేదా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని