Published : 28 May 2022 02:53 IST

Shoaib Akhtar: దినేశ్ కార్తీక్‌ తిరిగొచ్చిన విధానం చాలా నచ్చింది: అక్తర్

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చాలా బలంగా తిరిగిరావడం గొప్పగా ఉందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసించాడు. తాజాగా కార్తీక్‌ టీమ్‌ఇండియాకు ఎంపికైన నేపథ్యంలో అతడి గురించి అక్తర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘నేను సహజంగా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం ఒక్కటే. కార్తీక్‌ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అయినా, బలంగా తిరిగొచ్చాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో నేను స్వతహాగా చదివి తెలుసుకున్నా. దీంతో అతడు తిరిగొచ్చిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు చాలా గొప్ప పని చేశాడని చెప్పొచ్చు. పరిపక్వత అంటే ఇదే. నేను ఆడే రోజుల నుంచి అతడు ఆడుతున్నాడు. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడు. మంచి వారికి అంతా మంచే జరుగుతుంది. అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం చాలా గొప్పగా ఉంది. నా తరఫున అభినందనలు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని