Shoaib Akhtar: అప్పుడు పాంటింగ్‌ను గాయపర్చాలనే బౌలింగ్‌ చేశా: అక్తర్‌

ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ 1999 పాకిస్థాన్‌ పర్యటనలో ఉండగా ఒక టెస్టు మ్యాచ్‌లో కావాలనే బౌన్సర్లు సంధించి ఆటగాళ్లను గాయపర్చాలనుకున్నట్లు మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు...

Published : 21 Mar 2022 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ 1999 పాకిస్థాన్‌ పర్యటనలో ఉండగా ఒక టెస్టు మ్యాచ్‌లో కావాలనే బౌన్సర్లు సంధించి ఆటగాళ్లను గాయపర్చాలనుకున్నట్లు మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు. అప్పుడు ముఖ్యంగా రికీ పాంటింగ్‌.. తన బౌలింగ్‌ను ఎదుర్కొంటాడా లేదా అనేది పరీక్షించాలనుకున్నానని చెప్పాడు. తాజాగా సిడ్నీ హెరాల్డ్‌తో మాట్లాడిన అక్తర్‌ ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘అప్పుడు ఒక టెస్టు మ్యాచ్‌లో నేను.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో ఎవర్నో ఒకర్ని గాయపర్చాలనుకున్నా. అందుకే వేగవంతమైన బౌలింగ్‌ స్పెల్‌ వేశా. ఆరోజు పాంటింగ్‌ నా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడా లేదా అనేది చూడాలనుకున్నా. దాంతో కావాలనే బౌన్సర్లు సంధించి అతడిని పరీక్షించాలనుకున్నా. వీలైతే గాయపర్చాలనుకున్నా. కానీ, అంతకుముందెప్పుడూ పాంటింగ్‌కు అలా బౌలింగ్‌ చేయలేదు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో పాంటింగ్‌ కాకుండా మరే ఇతర బ్యాట్స్‌మెన్‌ ఉన్నా కచ్చితంగా తన బౌలింగ్‌తో వాళ్ల తల పగులగొట్టేవాడినని చెప్పాడు. కాగా, ఆ పర్యటన తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌ మళ్లీ ఇన్నాళ్లకు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవ్వగా అవి కూడా డ్రాగా ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని