Shoaib Akhtar: కోహ్లీ..! నువ్వో సాధారణ ఆటగాడివనే అనుకో..: అక్తర్‌

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు ఈ టీ20 టోర్నీలోనూ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు...

Published : 18 Apr 2022 02:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇటు ఈ టీ20 టోర్నీలోనూ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతడు 12 పరుగులకే రనౌటవ్వడంతో పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ విరాట్‌కు ఓ సూచన చేశాడు.

‘పరుగులు చేయకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందుకు కోహ్లీ మినహాయింపేమీ కాదు. అతడు సరిగ్గా ఆడకపోతే పక్కకు పెట్టొచ్చు. అతడి విషయంలో కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. ప్రస్తుతం అతడి బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతుండొచ్చు. అతడో మంచి వ్యక్తి, మంచి ఆటగాడే కాకుండా అతిగొప్ప క్రికెటర్‌. అయితే, అతడిని నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. తన మదిలో ఏం అనుకుంటున్నాడో అవన్నీ కాకుండా కేవలం ఒకే విషయం మీద ధ్యాసపెట్టాలని సూచిస్తున్నా. ఎవరు ఏమనుకుంటున్నారనేది వదిలేసి తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్‌ తీసుకొని దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి’ అని అక్తర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని