Cricket news: అక్తర్‌ పాడితే ఎలా ఉంటుందో తెలుసా?

టీమ్‌ఇండియా క్రికెటర్లలో ఎంతోమందికి పాటలంటే ఇష్టం. ఒకప్పటి డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఏకంగా బ్యాటింగ్‌ చేస్తూనే రాగాలు తీసేవాడు. పరుగులు రానప్పుడు ప్రముఖ గాయకుడు కిషోర్‌ కుమార్‌ పాటల్ని ఆలపించేవాడు. భారతీయులే కాకుండా పాక్‌ క్రికెటర్లకు, అభిమానులకు బాలీవుడ్‌ ఆపాత మధురాలంటే ఇష్టం

Updated : 20 Jun 2021 04:57 IST

అద్భుతం అంటున్న అభిమానులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లలో ఎంతోమందికి పాటలంటే ఇష్టం. ఒకప్పటి డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఏకంగా బ్యాటింగ్‌ చేస్తూనే రాగాలు తీసేవాడు. పరుగులు రానప్పుడు ప్రముఖ గాయకుడు కిషోర్‌ కుమార్‌ పాటల్ని ఆలపించేవాడు. భారతీయులే కాకుండా పాక్‌ క్రికెటర్లకు, అభిమానులకు బాలీవుడ్‌ ఆపాత మధురాలంటే ఇష్టం.

తాజా విషయం ఏంటంటే పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ గొప్ప పేసర్‌ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్‌ కూడా! ప్రచండ వేగంతో బంతులు విసిరే అతడు.. కిషోర్‌ కుమార్‌ పాటలను మధురంగా ఆలపించగలడు. అనేక సందర్భాల్లో అక్తర్‌ సన్నిహితులు, అభిమానుల ముందు తన గొంతు సవరించుకున్నాడు. ఒకప్పుడు అతడు పాటలు పాడిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

‘ఆతే జాతే ఖూబ్‌సూరత్‌ ఆవారా’, ‘మేరే నసీబ్‌ మై ఆయే దోస్త్‌’ వంటి పాటలను అక్తర్‌ ఆలపించాడు. మహ్మద్‌ రఫీ పాడిన ‘చో లేనే దో నాజూక్‌ హోతో’తోనూ మురిపించాడు. 2007లో సహారా వన్‌లో ప్రసారమైన ‘ఝూమ్‌ ఇండియా’ అనే రియాలిటీ షోలో తన గాత్రంతో అభిమానులను అలరించాడు. 2008లోనూ మరో షోలో పాటలు పాడాడు. ఆటకు వీడ్కోలు పలికాక అతడు భారతీయ టీవీ షోల్లో పాల్గొనడం గమనార్హం. 2015లో కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌, 2016లో మజాక్‌ మజాక్‌ మై, గేమ్‌ ఆన్‌ హైలో సందడి చేశాడు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని