Asian Games: ఆసియా క్రీడల్లో షూటింగ్ మెరుపులు.. రికార్డు స్థాయిలో పతకాలు
ఆసియా గేమ్స్‌లో (Asian Games) భారత షూటర్లు పతకాల పంట పండిస్తూనే ఉన్నారు. ఇవాళ వచ్చిన వాటిల్లో ఒక్కటి మినహా అన్నీ షూటింగ్‌లోనే రావడం విశేషం.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు క్రమంగా పుంజుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజులోనే ఎనిమిది పతకాలను సాధించారు. ఇందులో షూటర్లే ఏడింటిని సొంతం చేసుకోవడం విశేషం. మరొకటి సెయిలింగ్‌లో వచ్చింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో టీమ్ఇండియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. షూటింగ్లో మూడు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఐదు కాంస్య పతకాలను భారత షూటర్లు కైవసం చేసుకున్నారు.
టేబుల్ టెన్నిస్, చెస్, స్క్వాష్, ఈక్వస్ట్రియన్ ఈవెంట్లలో పతకాలు సాధించే దిశగా భారత క్రీడాకారులు సాగుతున్నారు. మరోవైపు ఆతిథ్య చైనా మొత్తం 131 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 72 స్వర్ణాలే ఉండటం విశేషం. చైనా తర్వాత కొరియా ( మొత్తం 62 పతకాలు), జపాన్ (59), ఉజ్బెకిస్థాన్ (28), హాంకాంగ్ (26) ఉన్నాయి.
భారత్‌కు ఇవాళ వచ్చిన పతకాలు ఇవీ..
- మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ పతకం గెలుచుకుంది.
- మహిళల 25 మీటర్ల జట్టు విభాగంలో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ బృందం గోల్డ్ సొంతం చేసుకుంది.
- మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం కైవసం చేసుకుంది.
- పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరుక రజత పతకం గెలిచాడు.
- మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాతో కూడిన జట్టు రజతం సొంతం చేసుకుంది.
- మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తగత విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం గెలుచుకుంది.
- పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో అంగద్, గుర్జోత్, అనంత్‌జీత్ సింగ్ కాంస్య కైవసం చేసుకున్నారు.
- పురుషుల దింగే ఐఎల్సీఏ 7 విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య దక్కించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?
ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
AB de Villiers: అందుకే త్వరగా ఆటకు వీడ్కోలు పలికా: ఏబీడీ
మైదానంలో అన్ని వైపులా ఎడాపెడా షాట్లు బాదే ఏబీ డివిలియర్స్‌కు 360 డిగ్రీల ఆటగాడని పేరు. భీకర ఫామ్‌లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచాడీ దక్షిణాఫ్రికా స్టార్. -
సఫారీ సవాలుకు సై
ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది.. న్యూజిలాండ్‌ను ఆ దేశంలోనే మట్టికరిపించింది.. ఆస్ట్రేలియా గడ్డపై విజయకేతనం ఎగరేసింది. -
డబ్ల్యూపీల్ను వేదికగా చేసుకుని..
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి తిరిగి భారత జట్టు తలుపు తట్టాలని భావిస్తున్నట్లు వేద కృష్ణమూర్తి తెలిపింది. -
మెరిసిన మోహిత్
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మోహిత్ గోయత్ (12 పాయింట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటడంతో శుక్రవారం పుణెరి జట్టు 43- 32 తేడాతో యు ముంబాను చిత్తుచేసింది. -
ఎవరి అభిప్రాయాలు వాళ్లవి
ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని, ముందుకు సాగడమే తన పని అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. -
ఇంగ్లాండ్ జోరును భారత్ ఆపేనా!
ఇంగ్లాండ్ మహిళల జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌కు పరీక్ష. సిరీస్‌లో ఆశలు నిలవాలంటే శనివారం రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం గెలవక తప్పదు. తొలి మ్యాచ్‌లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్‌కు అడ్డుకట్ట వేయడం టీమ్ఇండియాకు అంత తేలికేం కాదు. -
ఆదుకున్న ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్ (87; 72 బంతుల్లో 9×4, 4×6) ఆదుకోవడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. -
అహ్మదాబాద్ పిచ్ ‘సాధారణం’
భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ వికెట్‌ను ‘సాధారణ పిచ్’గా ఐసీసీ పేర్కొంది. -
మళ్లీ పంజాబ్ గూటికి బంగర్
టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మళ్లీ పంజాబ్స్ కింగ్స్ జట్టులో చేరాడు. వచ్చే సీజన్ కోసం పంజాబ్ డైరెక్టర్ (క్రికెట్ డెవలప్మెంట్)గా బంగర్ నియమితుడయ్యాడు. -
అర్షిన్ ఆల్‌రౌండ్ జోరు
అర్షిన్ కులకర్ణి (70 నాటౌట్; 3/29) ఆల్‌రౌండ్ జోరు ప్రదర్శించడంతో అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. -
ఎవరి పంట పండేనో..?
వచ్చే ఏడాది మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ నేపథ్యంలో శనివారం మినీ వేలం నిర్వహించనున్నారు. 2023లోనే డబ్ల్యూపీఎల్ ఆరంభమైన సంగతి తెలిసిందే.


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
-
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి భేటీ.. సభకు వెళ్తారా? లేదా?
-
World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించండి
-
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం