Shreyas Iyer: సూర్యకుమార్‌ యాదవ్‌ను వెనక్కి నెట్టి ఆ రికార్డు అందుకున్న శ్రేయస్‌ అయ్యర్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. 

Published : 15 Dec 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బంగ్లాదేశ్, భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్ (82*) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత  ఆటగాడిగా నిలిచాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్‌ సాధించాడు. శ్రేయస్‌ ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌ల్లో 1489 పరుగులు చేశాడు. ఇది వరకు ఈ రికార్డు సూర్యకుమార్‌ యాదవ్ (1424 పరుగులు, 43 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును శ్రేయస్‌ బ్రేక్‌ చేశాడు. 

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన ఛెతేశ్వర్‌ పుజారా శతకానికి చేరువై 90 పరుగుల వద్ద తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో పుజారా ఓ రికార్డును అందుకున్నాడు. వెంగ్‌ సర్కార్‌ (6,868) ని అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు  చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం పుజారా 6,882 పరుగులతో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్‌ (15,921) పరుగులతో టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ద్రవిడ్‌ (13,265), సునీల్ గావస్కర్‌ (10,122), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (8,781), సెహ్వాగ్ (8,503), విరాట్ కోహ్లీ (8,075), గంగూలీ (7,212) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని