IND VS SA : నేడు ఆఖరి మ్యాచ్‌.. శ్రేయస్‌, సిరాజ్‌లకు చోటు కల్పిస్తారా..?

ఇప్పటిక సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే టీ20 ప్రపంచకప్‌ ముందు ప్రయోగాలు చేసి జట్టును పటిష్ఠం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.

Published : 04 Oct 2022 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా మంగళవారం ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే టీ20 ప్రపంచకప్‌ ముందు ఉన్న ఆన్ని ఆప్షన్లు చెక్‌ చేసుకుని, జట్టును పటిష్ఠం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.  అలాగే వరుస మ్యాచ్‌లు ఆడుతున్న వారికి రెస్ట్‌ కూడా ఇచ్చినట్లు అవుతుంది. బ్యాటింగ్‌ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. డెత్‌ ఓవర్లలో బౌలర్లు తేలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చివరిదైన ఈ మ్యాచ్‌లో జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లకు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో విరాట్‌ స్థానం (నెం.3)లో శ్రేయస్‌ అయ్యర్‌ని తీసుకునే అవకాశం ఉంది. అయితే రాహుల్‌కి బదులు ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అనేది చూడాలి. రెగ్యులర్‌ బ్యాటర్‌ ఎవరూ బెంచ్‌లో లేరు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ షాబాద్‌ అహ్మద్‌కు ఛాన్స్‌ దొరికే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్‌కు అదనపు బౌలర్‌ ఆప్షన్‌ కూడా దొరుకుతుంది. 

బౌలింగ్‌ విషయానికొస్తే.. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌కు రెస్ట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం వస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఒకవేళ తప్పక చోటు కల్పించాలి అనుకుంటే.. గత మ్యాచ్‌లో లయ తప్పి ఇబ్బంది పడ్డ అర్ష్‌దీప్‌కి ఈ మ్యాచ్‌లో రెస్ట్‌ ఇవ్వొచ్చు. మరోవైపు సఫారీ జట్టు ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని