IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌

మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) దూరమయ్యాడు.

Published : 15 Mar 2023 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. వెన్ను గాయం కారణంగా ఈ సిరీస్‌కు టీమ్ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) దూరమయ్యాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టులో ఫీల్డింగ్‌ చేసిన అతడు.. ఈ గాయం కారణంగా బ్యాటింగ్‌ చేయలేదు. దీంతో వన్డే సిరీస్‌కు అయ్యర్ దూరమవుతాడని అప్పుడే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌ అధికారికంగా ధ్రువీకరించాడు. ‘ఆటలో గాయాలు ఒక భాగం. మా వద్ద అత్యుత్తమ వైద్య పరికరాలు, సదుపాయాలున్నాయి.  మేం జాతీయ క్రికెట్ అకాడమీతో సమన్వయంతో ఉన్నాం.  ఈ సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు’ అని ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. 

ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్‌కు కూడా శ్రేయస్‌ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌లో అయ్యర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో  కొత్త కెప్టెన్‌గా ఎవరిని నియమించాలనే కేకేఆర్‌ కసరత్తు మొదలెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు