ICC: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. దూసుకొచ్చిన యువ బ్యాటర్లు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక స్థానం కిందకు పడిపోయాడు.
దిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శనకు గాను టీమ్ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. 129 పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. 6 స్థానాలు దాటుకొని 27వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. 108 పరుగులు చేసి 3 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్ గిల్ 34వ ర్యాంక్‌లో నిలిచాడు. 0-1తో ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే, కివీస్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించినప్పటికీ కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కో స్థానం కిందకు దిగి 8, 9 ర్యాంకుల్లో నిలిచారు. న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ సైతం ఒక స్థానం పురోగతిని సాధించారు. తొలి వన్డేలో ఆ జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడంలో లాథమ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కేన్ సైతం టాప్ 10 స్థానంలో చేరాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
-
India News
Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం
-
Sports News
IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్