Team India: శ్రేయస్‌ గాయంతో భారత్‌ జట్టుకు సమస్యలు మొదలు

భారత్‌(Team India)కు బ్యాటింగ్‌లో బలమైన రిజర్వు ఆటగాళ్లు ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి ఎంపిక సవాలుగా మారనుంది. శ్రేయస్‌ గాయం కారణంగా ఖాళీ అయిన స్థానంలోకి సూర్యకుమార్‌ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 

Published : 06 Feb 2023 12:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గాయపడటంతో భారత్‌(Team India)కు సమస్యలు మొదలయ్యాయని టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి నాగ్‌పుర్‌లో భారత్‌ సేన ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ మాట్లాడుతూ ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ గాయం మరో సమస్యను సృష్టించింది. అతడి స్థానంలో ఎవరిని ఆడించాలన్నది భారత్‌(Team India)కు ఓ సవాల్‌. 5వ స్థానంలో సరిపోయే ఆటగాడు ఎవరైనా రిజర్వులో ఉన్నారా అంటే..  అది సూర్యకుమార్‌ యాదవ్(Suryakumar Yadav). శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill), రోహిత్‌ శర్మ(Rohit Sharma), కేఎల్‌ రాహుల్‌(KL Rahul) ఓపెనర్లు. వీరిలో రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్‌ ప్రారంభించేది ఎవరు..? గతంలో జట్టు ఎంపికను గమనిస్తే.. ద్విశతకం చేసిన ఇషాన్‌ కిషన్‌ను వారు రిజర్వులో కూర్చోబెట్టారు. ఈ లెక్కన శుభమన్‌ గిల్‌ బాగా ఆడుతున్నా.. కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వెళ్లే అవకాశాలున్నాయి’’ అని చోప్రా వివరించాడు.

‘‘శుభ్‌మన్‌ (Shubman Gill) కేసు బలమైంది. ఎందుకంటే అతడు బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచి పరుగులు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 2023లో అతడిలా పరుగుల వరద పారించినవారు లేరు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు టెస్ట్‌ క్యాప్‌ ఇవ్వొచ్చని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. వెన్నెముక గాయం కారణంగా శ్రేయస్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అతడు ఇప్పటికీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు శ్రేయస్‌ అందుబాటులో లేడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని