
Siraj - Shreyas: శ్రేయస్ మ్యాజిక్.. సిరాజ్ షాక్!
వీడియోను షేర్ చేసిన బీసీసీఐ
ఇంటర్నెట్ డెస్క్: కివీస్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ మంచి జోష్‌లో ఉంది. టెస్టు సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్‌ను షురూ చేసేసింది. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ చేసిన తమాషాను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అసలేం జరిగిందంటే..
బంతులతో నిప్పులు చెరిగే సిరాజ్‌ను శ్రేయస్ అయ్యర్ సరదాగా ఆటపట్టించాడు. శ్రేయస్ చేసిన ప్లేయింగ్ కార్డ్స్ (పేక ముక్కలు) మ్యాజిక్‌తో పాపం సిరాజ్ నోట మాట రాలేదు. కార్డు సెట్లోని ఓ ముక్కను ఎంచుకోవాలని సిరాజ్‌కు చెప్తాడు అయ్యర్. దానిని పక్కనే ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌కు చూపించమంటాడు. సిరాజ్ అలానే చూపించి శ్రేయస్‌కు ఇచ్చేస్తాడు. అప్పుడు శ్రేయస్ ఆ కార్డును కాకుండా మరో కార్డును సిరాజ్ చేతిలో పెట్టి.. ఇంకో కార్డుతో చేతిపై నెమ్మదిగా రుద్దుతాడు. తీరా చేతిమీద రుద్దిన కార్డే తొలుత సిరాజ్ ఎంచుకున్న కార్డు కావడం విశేషం. అయితే శ్రేయస్ చేసిన గోల్మాల్ ఏంటంటే.. సిరాజ్ ఇచ్చిన కార్డును తన చేతిలో పెట్టుకుని మధ్యలో నుంచి వేరే కార్డును తెలివిగా తీసి ఇస్తాడు. మరి ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి..
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.