Shubman Gill: నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్‌మన్‌ గిల్

గిల్ స్వదేశానికి అర్ధంతరంగా తిరిగి రావడానికి కారణమేంటనే దానికి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలూ వచ్చాయి.

Published : 17 Jun 2024 13:57 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం రిజర్వ్‌ ట్రావెల్‌గా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) యూఎస్‌ఏ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే అతడిని వెనక్కి పిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని భారత బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్‌ (Vikram Rathod) ఖండించాడు. కరేబియన్‌లో మ్యాచ్‌లు ఆడే సమయానికి ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని మేనేజ్‌మెంట్‌ ఎప్పుడో నిర్ణయించిందని రాథోడ్‌ స్పష్టంచేశాడు. తాజాగా శుభ్‌మన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. రోహిత్‌ శర్మతోపాటు (Rohit Sharma) అతడి కుమార్తె సమైరాతో దిగిన ఫొటోను గిల్ షేర్ చేశాడు. ‘‘సమైరా, నేను ఓ వ్యక్తి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం. అతడే రోహిత్ శర్మ’’ అని క్యాప్షన్ జోడించాడు. 

కుమారుడితో హార్దిక్‌ పోస్టు వైరల్

ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కుటుంబంలో వివాదాలు తలెత్తాయని.. తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్లేనని కొట్టిపడేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా హార్దిక్‌ పాండ్య స్పెషల్‌ పోస్టు పెట్టాడు. తన కుమారుడు అగస్థ్యతో ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘నా జీవితంలోకి ప్రేమ, సంతోషం తీసుకొచ్చినందుకు థాంక్యూ. నువ్వు గర్వపడే తండ్రిగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తా’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం హార్దిక్ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని