Gill - Prithvi: తానొక స్టార్ అని భావిస్తాడు.. పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ వ్యాఖ్యలు
అండర్ - 19 ప్రపంచకప్‌లో సహచురులైన వీరిద్దరూ.. ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఫామ్‌పరంగా మాత్రం ఇద్దరికి చాలా తేడా ఉంది. ఈ క్రమంలో గిల్ చిన్ననాటి కోచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు. ఇప్పుడు ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో ఒకరేమో ఆరెంజ్ క్యాప్ సాధించగా.. మరొకరు ఫామ్ కోల్పోయి తీవ్రంగా విమర్శపాలయ్యాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ఒకరు కాగా.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరొకరు. టీమ్‌ఇండియా తరఫున గిల్ మూడుఫార్మాట్లలోనూ రాణిస్తున్నాడు. పృథ్వీ షా మాత్రం జట్టులో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఫామ్‌ను కోల్పోయి ఇబ్బంది పడుతున్న పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ కార్సాన్ గర్వి సంచలన వ్యాఖ్యలు చేశాడు. షా యాటిట్యూడ్ సరిగ్గా ఉండదని, తానొక సూపర్ స్టార్ అని ఊహించుకుంటూ ఉంటాడని పేర్కొన్నాడు. ఎవరూ తనను టచ్ చేయలేరని భావించేవాడని తెలిపాడు.
‘‘2018 అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో వీరిద్దరు సభ్యులే. ఇప్పుడు పృథ్వీషా పరిస్థితి ఏంటి? శుభ్‌మన్ గిల్ ఎక్కడ ఉన్నాడు? ఇద్దరూ వేర్వేరు కేటగిరీ ప్లేయర్లుగా మారిపోయారు. పృథ్వీ ఎప్పుడూ స్టార్‌గా ఫీలవుతూ ఉంటాడు. ఎవరూ తనని అందుకోలేరని భావిస్తాడు. అయితే అతడు అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది. అది అంతర్జాతీయ క్రికెట్‌లోకానీ, రంజీ ట్రోఫీలోనైనా సరే బ్యాటర్ ఔట్ కావడానికి ఒకే ఒక్క బంతి చాలు. దూకుడుగా ఆడితే సరిపోదు. క్రమశిక్షణ చాలా ముఖ్యం. బ్యాటింగ్‌పై నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. క్రీజ్‌లో పాతుకుపోతే పరుగులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పృథ్వీ షా కష్టపడితే మళ్లీ ఫామ్ అందుకోవచ్చు. గిల్, పృథ్వీ షా ఒకే వయసు కలిగిన ఆటగాళ్లు. గిల్ కష్టపడ్డాడు. ఇప్పుడు ఫలితం దక్కుతోంది. షా మాత్రం అలా చేయలేకపోయాడు. ఇప్పటికీ జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి’’ అని గర్వి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?