Shubman Gill: గిల్ కుదురుకొన్నాడు.. సుదీర్ఘకాలం ఆడేయగలడు: రవిశాస్త్రి

భారత యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సీనియర్లు కేఎల్ రాహుల్‌, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పోటీనిస్తూ వన్డేల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కీలకమయ్యే ఆటగాళ్లలో ముందువరుసలో ఉంటాడు.

Published : 30 Nov 2022 01:28 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అత్యంత నిలకడగా ఆడుతున్న ఆటగాడు శుభ్‌మన్‌ గిల్. ఇదొక్క సిరీస్‌ మాత్రమే కాకుండా ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లోనూ అద్భుత ప్రదర్శనే చేస్తున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో కీలక ఆటగాడిగా మారే అవకాశ ఉందని పలువురు మాజీలు విశ్లేషించారు. కివీస్‌పై రెండు మ్యాచుల్లో (ఒక మ్యాచ్‌ రద్దు) అర్ధశతకంతో కలిపి 95 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో గిల్‌ ప్రదర్శనపై టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 

‘‘ప్రారంభ దశలో ఇబ్బంది పడినా గిల్‌ క్రమంగా వృద్ధి సాధించాడు. టాప్‌ ఆర్డర్‌లో కుదురుకొన్నాడు. అద్భుతమైన టైమింగ్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మంచి ఫుట్‌వర్క్‌తో బంతిపై నియంత్రణ సాధించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి బ్యాటింగ్‌ను చూడటం బాగుంది. గిల్‌ నాణ్యమైన ఆటగాడు. తప్పకుండా జట్టు కోసం సుదీర్ఘకాలంపాటు ఆడగల సత్తా ఉంది. పనిపట్ల నిబద్ధత, కష్టపడటం, ఆటపై ప్రేమ, పరుగులు చేయాలనే కోరిక బలంగా ఉండటం వల్లే గిల్‌ టాప్‌ ప్లేయర్‌గా మారతాడు. అతడు నిరంతరం వృద్ధి చెందుతూనే ఉన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్‌ కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని