Shubman Gill: శుభ్‌మన్ గిల్.. భవిష్యత్‌లో క్రికెట్‌ను శాసిస్తాడు: పాక్ మాజీ కెప్టెన్
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అతడిని ‘భవిష్యత్తు’ సూపర్ స్టార్‌గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభివర్ణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్‌ను ‘భవిష్యత్తు’ సూపర్ స్టార్‌గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 360 పరుగులు సాధించాడు. అతని వీరోచిత ఆటప్రదర్శనని అతను ప్రశంసించాడు. పరుగుల దాహంతో ఉన్న భారత బ్యాటర్ కేవలం ఒక్క భారీ స్కోర్‌తో సంతృప్తి చెందలేదన్నాడు.
‘‘శుభ్‌మన్‌గిల్ భవిష్యత్తు సూపర్ స్టార్. కివీస్‌తో మొదటి వన్డేలో ద్విశతకం బాది మూడో వన్డేలోనూ సెంచరీ సాధించాడు. కేవలం ఒక్క భారీ స్కోర్‌తో అతడు సంతృప్తి చెందలేదు. అతడు పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పటానికి ఈ సిరీస్ నిదర్శనం. అతడి వయసు 23 ఏళ్లే. ఇంత చిన్న వయసులో అతడు చూపించిన బ్యాటింగ్ అద్బుతం. గిల్ మంచి ప్రతిభ గల ఆటగాడు కానీ 30, 40 పరుగులు చేసి వెనుదిరుగుతున్నాడు అని ఇదివరకు భావించే వాళ్లం. కానీ ఇప్పుడు అతడు మా అభిప్రాయాన్ని మార్చేశాడు. నిలకడగా రాణిస్తూ భారీ స్కోర్ సాధిస్తూ భారత టాప్ ఆర్డర్‌కు అండగా నిలుస్తున్నాడు’’ అని భట్ తెలిపాడు.
కివీస్‌తో మొదటి వన్డేలో డబుల్ సెంచరీ(208) రెండో వన్డేలో 40 పరుగులు మూడో వన్డేలో శతకం(112) సాధించాడు. దాంతో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా పాక్ ఆటగాడు బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపనని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
Sports News
Pervez Musharraf - MS Dhoni: ‘నీ హెయిర్ స్టైల్ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’
-
General News
AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
-
Sports News
ASHWIN: ఇంతకీ అశ్విన్ బౌలింగ్ శైలి ఏంటి..? వైరల్‌గా మారిన ‘ఎడిటెడ్ బయో’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
World News
Pervez Musharraf: విమానంలో కూర్చొనే.. ప్రభుత్వాన్ని కూల్చిన ముషారఫ్!