IND vs AUS: గిల్, సూర్యకుమార్‌.. ఇద్దరిలో ఎవరు? రోహిత్‌ ఏమన్నాడంటే?

ఆసీస్‌తో తొలి టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు.

Published : 08 Feb 2023 21:13 IST

నాగ్‌పుర్: ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) ప్రారంభంకానుంది. నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్‌ భారత్‌కు కీలకం కానుంది. సిరీస్‌కు ఎంపికైన మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో ఆ స్థానం కోసం ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గిల్‌, సూర్యకుమార్‌ల ఎంపిక గురించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు. 

‘శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు ఈ మధ్య భారీ శతకాలు బాదాడు. మరోవైపు, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తనెంటో నిరూపించుకున్నాడు. కానీ, వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని రోహిత్‌ శర్మ వివరించాడు. కారు ప్రమాదంలో గాయపడి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీకి దూరమైన రిషభ్‌ పంత్‌ గురించి కూడా రోహిత్‌ మాట్లాడాడు. ‘మేం రిషభ్‌ పంత్‌ సేవలను కోల్పోతున్నాం. కానీ, అతడి పాత్రను పూర్తి చేయడానికి మా దగ్గర ఆటగాళ్లున్నారు. మేం వారితో మాట్లాడి ప్రణాళికల గురించి తెలుసుకున్నాం. రేపటి నుంచి వాటి అమలుపరుస్తాం’ అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు