NZ vs IND: నేను కుదురుకుంటే సిక్స్‌లు కొట్టగలను: శుభ్‌మన్‌ గిల్

టెస్టుల్లో రెగ్యులర్‌గా, వన్డేల్లో అప్పుడప్పుడు టీమ్‌ఇండియాకు ఆడుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్‌ ఇప్పుడు టీ20ల్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు.

Published : 19 Nov 2022 02:12 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో రెగ్యులర్‌గా, వన్డేల్లో అప్పుడప్పుడు టీమ్‌ఇండియాకు ఆడుతున్న యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్‌ ఇప్పుడు టీ20ల్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తోపాటు నవంబర్‌ 25 నుంచి ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్‌కు గిల్‌ ఎంపికైన విషయం తెలిసిందే. ఇవాళ వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఒకవేళ నేడు ఈ మ్యాచ్‌ జరిగి ఉంటే ఇషాన్‌ కిషన్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగేవాడు. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్‌ మంత్రాన్ని వెల్లడించాడు గిల్. డాట్‌ బాల్స్‌ని తగ్గించి స్ట్రెక్‌రొటేట్‌ చేయడం ముఖ్యమని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌లో 2019లో వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసినప్పుడు, 2016లో అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. సిక్స్‌లు కొట్టడం అనేది బలంపై కాకుండా టైమింగ్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు. 

‘నేను అండర్‌ -19 ప్రపంచ కప్ కోసం ఇక్కడికి (న్యూజిలాండ్‌) వచ్చాను. 2019లో ఇక్కడే వన్డేల్లో అరంగేట్రం చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. న్యూజిలాండ్‌లో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని టెక్నిక్‌లను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేయగలిగాను. సిక్స్‌లు కొట్టడం అనేది బలానికి సంబంధించినది కాదని, అది టైమింగ్‌ బట్టి ఉంటుందని  నాకెప్పుడూ అనిపిస్తుంది. నేను సరిగ్గా కుదురుకుంటే సిక్స్‌లు కొట్టగలనని నాకు తెలుసు. కానీ, ఎప్పుడు ఫోర్‌ లేదా సిక్స్ కోసం చూడకుండా స్కోర్ చేయాలని చూస్తున్నాను. నేను తక్కువ డాట్‌ బాల్స్‌ ఆడి సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలో పరుగులు రాబట్టాలనుకుంటున్నా’ అని శుభ్‌మన్‌ గిల్‌ వివరించాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని