IND vs NZ: శుభ్‌మన్ గిల్ టీ20ల్లో ఇంకా రాణించాలి: ఆకాశ్ చోప్రా
కివీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ల వైఫల్యంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో బ్యాటర్ల వైఫల్యంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరును ఛేదించడానికి లఖ్‌నవూ పిచ్‌పై భారత బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారని పేర్కొన్నాడు. యువబ్యాటర్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లో ఇంకా రాణించాల్సి ఉందని తెలిపాడు. అలాగే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సారథ్యాన్ని చోప్రా ప్రశంసించాడు.
‘‘కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీ గొప్పగా ఉంది. తొలి టీ20లో శాంట్నర్ వేసిన బంతికే శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లో మైఖేల్ బ్రాస్‌వెల్ బంతికి పెవిలియన్ చేరాడు. రెండు మ్యాచుల్లోనూ అతడు మంచి స్కోర్ సాధించలేకపోయాడు. టీ20ల్లో గిల్ ప్రదర్శనను నేను విమర్శించట్లేదు. కానీ ఇది అతడి సమస్య. ఇషాన్‌కిషన్ రాణిస్తాడనుకుంటే రనౌట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠీ తన బ్యాట్‌ను తిప్పినా ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సైతం ఇబ్బంది పడ్డాడు’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్