Shreyas Iyer:శ్రేయస్‌ అయ్యర్ ఆ లోపాన్ని సరి చేసుకోవాలి: సైమన్‌ డౌల్‌

షార్ట్‌ బాల్స్‌ని ఎదుర్కోవడంలో శ్రేయస్‌ అయ్యర్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడని, అతడు ఆ లోపాన్ని సరిచేసుకోవాలని కివీస్ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ సూచించాడు.

Published : 27 Nov 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (80) అర్ధ శతకంతో రాణించాడు. అయితే, శ్రేయస్‌ తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో షార్ట్‌ బాల్స్‌ని ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ గురించి కివీస్ మాజీ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ మాట్లాడాడు. షార్ట్‌ బాల్స్‌ని ఎదుర్కోవడంలో శ్రేయస్‌ అయ్యర్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడని, అతడు ఆ లోపాన్ని సరిచేసుకోవాలని కోరుకుంటున్నానని డౌల్‌ తెలిపాడు. స్పిన్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ దూకుడుగా ఆడతాడని, కానీ అతడు కొంచెం దూకుడు తగ్గించి ఆడితే ఇష్టపడతానని పేర్కొన్నాడు. 

అలాగే, ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి కూడా సైమన్‌ డౌల్‌ మాట్లాడాడు. ‘కఠినమైన పిచ్‌పై ఇది నిజంగా మంచి అరంగేట్రం. అతడు చాలాకాలంపాటు దేశం తరఫున ఆడతాడని అనుకుంటున్నా. ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శన ద్వారా ఒక వ్యక్తిని అంచనా వేయలేం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..  ఉమ్రాన్‌ ఈ మ్యాచ్‌ కంటే ముందు మూడే లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడాడు. అతడు నేర్చుకుంటున్నాడు. మంచి బ్యాటింగ్ పిచ్‌లపై నాణ్యమైన ఆటగాళ్లకు బౌలింగ్‌ చేయడం అంత సులభం కాదు. ఈ మ్యాచ్‌లో నేను ఉమ్రాన్‌కి పాస్‌ మార్కులు ఇస్తున్నా’ అని  సైమన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని