Published : 04/12/2021 18:47 IST

PV Sindu: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌.. ఫైనల్లోకి ప్రవేశించిన సింధు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్‌ పోరులో జపాన్‌ స్టార్‌ యమగూచిని ఓడించిన సింధు.. ఫైనల్ల్లోకి అడుగు పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ పోరులో సింధు.. 21-15 15-21 21-19 తేడాతో యమగూచిని ఓడించింది. ఆదివారం జరుగనున్న టైటిల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి సియోంగ్‌తో సింధు తలపడనుంది. 2018లో బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్ విజేతగా నిలిచిన మొదటి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

టోక్యో ఒలింపిక్స్‌-2020లో కాంస్య పతకం సాధించిన సింధు.. అప్పటి నుంచి మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. చివరగా ఆడిన మూడు (ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఇండోనేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్‌) టోర్నమెంట్లలోనూ సెమీఫైనల్ దశ వరకు చేరుకుంది.

Read latest Sports News and Telugu News


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని