
Updated : 19 Jan 2022 06:14 IST
Mohammed Siraj: ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్
పార్ల్: భారత మాజీ కెప్టెన్ కోహ్లీని సూపర్ హీరోగా అభివర్ణించిన పేసర్ మహమ్మద్ సిరాజ్.. అతనే ఎప్పటికీ తన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ‘‘నా సూపర్ హీరో (కోహ్లి).. నీ నుంచి పొందిన మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు చెప్పడం ఏ మాత్రం సరిపోదు. నువ్వెప్పుడూ నా గొప్ప సోదరుడివి. ఇన్నేళ్లుగా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నా పేలవ ప్రదర్శనలోనూ ఉత్తమ ఆటతీరు చూశావు. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్’’ అని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కోహ్లి సారథ్యంలోనే సిరాజ్ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునా వీళ్లిద్దరు కలిసే ఆడుతున్నారు. విరాట్ కెప్టెన్సీలో ఈ హైదరాబాదీ పేసర్ 8 టెస్టుల్లో 27.04 సగటుతో 23 వికెట్లు తీశాడు.
Tags :