Soccer legend Pele: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే.!

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగులోని కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన అనంతరం వైద్యులు ఆయనను ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచారు.

Published : 12 Sep 2021 01:09 IST

(Photo: Pele Twitter)

ఇంటర్నెట్‌ డెస్కు : బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగులోని కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన అనంతరం వైద్యులు ఆయనను ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచారు. ‘ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉంది. కీలక అవయవాలన్నీ బాగానే పని చేస్తున్నాయి. ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారు’ అని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ‘రోజురోజుకి నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అని పీలే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేయారు. 

మూడు ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా పీలే రికార్డు సృష్టించారు. 1958, 1962, 1970ల్లో మూడు సార్లు పీలే బ్రెజిల్‌ను ‘ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌’గా నిలిపారు. బ్రెజిల్‌ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని