అప్పుడలా..ఇప్పుడిలా..జింక్స్‌పై సెటైర్లు

కోహ్లీ గైర్హాజరీ, వెంటాడుతున్న ‘36’ చేదు జ్ఞాపకాల్లోనూ అజింక్య రహానె జట్టును గొప్పగా నడిపించి ఆస్ట్రేలియా సిరీస్‌ను సాధించాడు. ప్రతికూలతల నడుమ సత్తాచాటడంతో అతడిపై ప్రశంసలు....

Published : 10 Feb 2021 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోహ్లీ గైర్హాజరీ, వెంటాడుతున్న ‘36’ చేదు జ్ఞాపకాల్లోనూ అజింక్య రహానె జట్టును గొప్పగా నడిపించి ఆస్ట్రేలియా సిరీస్‌ను సాధించాడు. ప్రతికూలతల నడుమ సత్తాచాటడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. గొప్ప నాయకుడని కొనియాడారు. మరికొంతమంది జింక్స్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని అన్నారు.

అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రహానె వరుసగా (1, 0)తో విఫలమవ్వడంతో సీన్‌ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రహానె ఆటతీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా, రహానె ప్రదర్శనపై సంజయ్‌ మంజ్రేకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీ అనంతరం వరుసగా 27*, 22, 4, 37, 24, 1, 0 పరుగులు చేశాడని ట్వీట్ చేశాడు.

మరోవైపు రహానెకు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. రహానె గొప్ప బ్యాట్స్‌మన్‌ అని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తుచేశాడు. ఈ టెస్టులో తక్కువ స్కోరు వద్ద వెనుదిరిగాడని, అయితే తొలి ఇన్నింగ్స్‌లో రూట్ అద్భుత క్యాచ్‌తో ఔటయ్యాడని అన్నాడు. రహానెతో పాటు ఆటగాళ్లందరూ గొప్పగానే ప్రయత్నించారని, మరింత దృష్టిసారించి రెండో టెస్టు బరిలోకి దిగుతామని తెలిపాడు.

ఇవీ చదవండి

కసి.. నిలకడ.. కనిపించలేదు: కోహ్లీ

చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి.. 






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని