David Warner: కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయించొచ్చు: మహమ్మద్‌ కైఫ్‌

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ని తప్పించి పెద్ద తప్పు చేసిందని మాజీ క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ అన్నాడు.

Published : 17 Nov 2021 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ని తప్పించి పెద్ద తప్పు చేసిందని మాజీ క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ అన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో అతడు విఫలమైన మాట వాస్తవమేనని.. అంత మాత్రాన అతడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయించవచ్చని పేర్కొన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడని చెప్పాడు. ఇటీవల ముగిసిన పొట్టి ఫార్మాట్లో ఆసీస్ తొలిసారి విజేతగా నిలవడంలో వార్నర్‌ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో 289 పరుగులు చేసిన అతడు ‘ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్’గా నిలిచాడు.  

‘జీవితంలో అయినా, క్రీడల్లోనైనా ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దు. ఐపీఎల్ నుంచి వార్నర్‌ని తప్పించిన కొద్ది వారాల్లోనే.. అతడు గొప్పగా పుంజుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’గా నిలిచాడు. కొన్ని సార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయించొచ్చు’ అని మహమ్మద్‌ కైఫ్ ట్వీట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని