Sourav Ganguly: ఆ రెండూ మీకు దక్కాలి దాదా!

టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు అతడు చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు....

Updated : 08 Jul 2021 13:21 IST

క్రికెట్‌ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం 49వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు అతడు చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ మొదలుకొని అనేకమంది అతడికి శుభకాంక్షలు తెలియజేశారు.

అంకితభావం, దార్శనికతలో దాదాతో కొంతమందే సరిపోలుతారు. ఎప్పటిలాగే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి దాదా. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదా

- వీరేంద్ర సెహ్వాగ్‌

పుట్టినరోజు శుభాకాంక్షలు గంగూలీ. జీవితంలోనే అతిపెద్ద ఆనందం, ఆశీర్వాదాలు నీకు దక్కాలి. ఈ ఏడాదంతా బాగుండాలి

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఆఫ్‌సైడ్‌ ఫీల్డర్ల మధ్య బంతిని తరలించే రాకుమారుడికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు

- చెన్నై సూపర్‌కింగ్స్‌

అతడిలోని దూకుడు, అభిరుచికి మరెవ్వరూ సరిపోరు. భారత క్రికెట్‌ను మార్చేసిన, ఎన్నో రకాలుగా జట్టులో ప్రేరణ నింపిన దాదాకు జన్మదిన శుభాకాంక్షలు

- పంజాబ్‌ కింగ్స్‌

నా కెప్టెన్‌ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ప్రేమిస్తుంటాను దాదా

- హర్భజన్‌ సింగ్‌

జన్మదిన శుభాకాంక్షలు దాదా. టీమ్‌ఇండియా తరఫున మీ సారథ్యంలో అరంగేట్రాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ అండదండలకు ధన్యవాదాలు 

- దినేశ్‌కార్తీక్‌

దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత క్రికెట్‌ మీకెప్పటికీ రుణపడి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తమ ఫలితాలను రాబట్టిన మీకు కృతజ్ఞతలు. క్రికెట్‌ పట్ల మీ అభిరుచి, అంకితభావం రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి

- సురేశ్‌ రైనా

మైదానంలో దాదా మనల్ని నడిపిస్తుంటే మనం చాలా ఉన్నతంగా కనిపిస్తాం. విఫలమైనప్పుడు భుజం తట్టే.. రాణించినప్పుడు వెన్నుతట్టే కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దాదా పుట్టుకతోనే నాయకుడు

- మహ్మద్‌ కైఫ్‌



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని