Sourav Ganguly: శుభ్‌మన్‌ గిల్ ఇప్పుడు పర్మినెంట్ ప్లేయర్: గంగూలీ

కొంత కాలంగా మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) పై భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.

Published : 15 Mar 2023 23:30 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కొంతకాలంగా అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో సెంచరీల మోత మోగించాడు. ఆస్ట్రేలియాతో మొదటి రెండు టెస్టులకు తుది జట్టులో స్థానం దక్కలేదు. మూడో టెస్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ప్లేయింగ్ XIలోకి వచ్చినా.. తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. నాలుగో టెస్టులో మాత్రం శతకం (128) బాది మరోసారి సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ప్రశంసలు కురిపించాడు. అతను టీమ్‌ఇండియాలో పర్మినెంట్‌ ఆటగాడిగా మారడానికి తగినంత కృషి చేశాడని గంగూలీ పేర్కొన్నాడు.

‘మొదటగా ఆస్ట్రేలియాను ఓడించినందుకు టీమ్‌ఇండియాకు అభినందనలు. భారత్.. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో గెలిచింది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)లో ఎందుకు విజయం సాధించకూడదు? బాగా బ్యాటింగ్ చేయండి. 350-400 స్కోర్ సాధించండి. అప్పుడు మీరు గెలిచే స్థితిలో ఉంటారు. శుభ్‌మన్ గిల్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం చూస్తున్నాను. అతను గత 6-7 నెలలుగా బాగా ఆడుతున్నాడు. అతను ఇంకేం చేయాలి? గిల్‌ ఇప్పుడు పర్మినెంట్ ప్లేయర్‌’ అని గంగూలీ అన్నాడు.

అనంతరం రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్‌ల స్పిన్ త్రయాన్ని ప్రశంసించాడు.  వారు టీమ్‌ఇండియా బలమని పేర్కొన్నాడు. ‘అశ్విన్‌, జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో అక్షర్‌ పటేల్ బ్యాట్‌తో రాణిస్తున్నాడు. బౌలింగ్‌ కూడా బాగానే చేస్తున్నాడు. ఈ త్రయం టీమ్‌ఇండియా బలం’ అని గంగూలీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని