Mega Blockbuster: రష్మికతో గంగూలీ, రోహిత్ శర్మ‌.. సినిమా కోసమేనా..?

సినీ, క్రికెట్‌ అభిమానుల్లో ఓ అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ‘మెగా బ్లా్క్‌బస్టర్’  పేరుతో విడుదలైన పోస్టర్లే ఈ చర్చకు కారణం........

Published : 03 Sep 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ, క్రికెట్‌ అభిమానుల్లో ఓ అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ‘మెగా బ్లాక్‌బస్టర్’ (Mega Blockbuster) పేరుతో విడుదలైన పోస్టర్లే ఈ చర్చకు కారణం. భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మతోపాటు దక్షిణాదితోపాటు ఉత్తరాది చిత్రాల్లోనూ బిజీగా ఉన్న నాయిక రష్మిక మందన్నా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ‘మెగా బ్లాక్‌ బస్టర్‌’ పేరుతో తమతమ పోస్టర్లను విడుదల చేశారు. ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ సైతం ఈ పోస్టర్‌ను పంచుకున్నాడు.

తాను ఉన్న పోస్టర్‌ను గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘షూటింగ్‌ ఆసాంతం సరదాగా సాగింది’ అని పేర్కొనగా, ‘నవ్వులతో నా పొట్ట చెక్కలైంది. ఇది నా అరంగేట్రం లాంటిది’ అంటూ రోహిత్‌ పోస్ట్‌ చేశాడు. అయితే ఈ పోస్టర్లు దేనికి సంబంధించినవో మాత్రం వారు స్పష్టంగా చెప్పలేదు. సెప్టెంబర్‌ 4న ట్రైలర్‌ అని మాత్రమే వెల్లడించారు. వారి పోస్టులు చూసిన సినీ, క్రీడాభిమానులు అయోమయంలో పడ్డారు. ఆ పోస్టర్లు ఏదైనా సినిమాకు సంబంధించిందా? లేక టెలివిజన్‌ షోనా?, కార్యక్రమమా? అదీ కాక ఏదైనా ప్రకటనకు సంబంధించిన పోస్టరా? అంటూ చర్చలు సాగిస్తున్నారు. ఈ 4వ తేదీన ట్రైలర్‌ విడుదల తర్వాతే ఇది దేని గురించో తెలిసే అవకాశం ఉంది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని