Sourav Ganguly: రోహిత్‌ - కోహ్లీల గురించి ఆందోళనే లేదు: గంగూలీ

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల ఫామ్‌ గురించి ఆందోళనే లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు...

Published : 17 May 2022 09:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల ఫామ్‌ గురించి ఆందోళనే లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన దాదా.. ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌లో వాళ్లిద్దరూ పరుగులు చేయకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. వాళ్లిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లని, టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఇంకా ఐదు నెలల సమయం ఉందన్నాడు. అప్పటికల్లా వారిద్దరూ మంచి ఫామ్‌లో ఉంటారనే నమ్మకం ఉందన్నాడు.

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్‌లో ముంబయి టీమ్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 18.17 సగటుతో 218 పరుగులే చేశాడు. మరోవైపు బెంగళూరు టీమ్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే విరాట్‌ కోహ్లీ మాత్రం ఫామ్‌లో లేక తంటాలు పడుతున్నాడు. అతడు ఆడిన  13 మ్యాచ్‌ల్లో 19.67 సగటుతో 236 పరుగులే చేశాడు. దీంతో వీరిద్దరి బ్యాటింగ్‌ ప్రదర్శనలపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని