Sourav Ganguly: దాదాకు ‘జెడ్’ కేటగిరీ భద్రత.. ఇంతకుముందు ఏముందంటే?
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భద్రత విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడున్న భద్రతను మరింత పెంచుతూ పశ్చిమ్ బంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) భద్రత విషయంలో పశ్చిమ్ బంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ‘వై’ కేటగిరీలో ఉన్న దాదాకు ‘జెడ్’ కేటగిరీగా మార్చినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. గంగూలీకి మంగళవారంతో ‘వై’ కేటగిరీ భద్రత గడువు ముగియడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘వీవీఐపీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం.. గంగూలీకి ‘వై’ కేటగిరీ భద్రత ముగిసింది. దీంతో ఆయనకు ‘జెడ్’ కేటగిరీలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని సదరు అధికారులు వెల్లడించారు.
కొత్త సెక్యూరిటీ విధానం ప్రకారం 8 నుంచి 10 మంది వ్యక్తిగత భద్రతా అధికారులు గంగూలీకి సెక్యూరిటీ ఇస్తారు. ఇంతకుముందు వై కేటగిరీలో ఉన్నప్పుడు మాత్రం స్పెషల్ బ్రాంచ్ నుంచి ముగ్గురు పోలీసులు, అలాగే మరో ముగ్గురు ఇంటి వద్ద ఉండేవారు. ‘‘ప్రస్తుతం గంగూలీ దిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్నారు. మే 21న కోల్‌కతాకు చేరుకుంటారు. అప్పటి నుంచి ఆయన ‘జెడ్’ కేటగిరీ సెక్యూరిటీ ప్రారంభమవుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
-
Movies News
Social Look: మాల్దీవుల్లో రకుల్‌ప్రీత్ మస్తీ.. బస్సులో ఈషారెబ్బా పోజులు
-
General News
Bhaskar Reddy: ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా వైఎస్ భాస్కర్‌రెడ్డి
-
Sports News
WTC Final: తుది జట్టు అలా ఉండొద్దు.. అప్పటి పొరపాటును మళ్లీ చేయొద్దు: ఎంఎస్కే ప్రసాద్
-
General News
TTD: తిరుమల ఘాట్రోడ్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: ఈవో