PV Sindhu : వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌నకు పీవీ సింధు దూరం

బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు...

Published : 13 Aug 2022 21:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు (డబ్ల్యూసీ) దూరమైంది. గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వర్గాలు వెల్లడించాయి. కామన్వెల్త్‌గేమ్స్‌ సింగిల్స్ ఫైనల్‌లోనూ సింధు గాయంతోనే ఆడినట్లు పేర్కొన్నాయి. 

ఆగస్టు 21 నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. డబ్ల్యూసీలో పీవీ సింధుకు మంచి రికార్డు ఉంది. 2019 సీజన్‌లో స్వర్ణంతోపాటు అంతకుముందు రెండు కాంస్య పతకాలను సాధించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఈసారి టోక్యో ఆతిథ్యం ఇస్తోంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts