Bumrah Jansen : ఆ సమయంలో జాన్సెన్ ఐపీఎల్ గురించి ఆలోచించలేదు: ప్రిన్స్

 దక్షిణాఫ్రికా యువ పేసర్‌ మార్కో జాన్‌సెన్‌ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ బ్యాటర్‌..

Updated : 31 Jan 2022 10:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా యువ పేసర్‌ మార్కో జాన్‌సెన్‌ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ బ్యాటర్‌ ఆష్లే ప్రిన్స్‌ ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా దేశం కోసం ఐపీఎల్‌ అవకాశాలను పణంగా పెట్టాడని కొనియాడాడు. రెండో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా బుమ్రా, జాన్‌సెన్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత ఐపీఎల్‌ సీజన్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, జాన్‌సెన్‌ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.

దీనిని ఉద్దేశించి ప్రిన్స్ సోషల్‌ మీడియాలో స్పందించాడు.  ‘‘ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన భారత్‌xదక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో నన్ను ఆకర్షించింది జాన్‌సెన్‌ ఆటతీరు. బుమ్రాతో జరిగిన వాగ్వాదంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఆ సమయలో ఐపీఎల్‌ గురించి ఆలోచించలేదు. ఇలాంటి దాని వల్ల వారితో తన సంబంధాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయనేది పక్కన పెట్టాడు. తన తొలి ప్రాధాన్యం దేశానికే కేటాయించాడు. వెల్‌డన్‌ కిడ్.. ఇలాగే ఉండు. ఎప్పటికీ మారకు. పోరాట స్ఫూర్తితో ఆడాలి. దేశమే తొలి ప్రాధాన్యం. ఐపీఎల్‌లోకి తీసుకుంటారో లేదో అనేది వారి సమస్య. ఆట అనేది పోటీతత్వంగా ఉండాలి. అంగుళం కూడా తలొగ్గొద్దు. బ్యాంకు బ్యాలెన్స్‌ల కోసం ఆడొద్దు. యువ క్రీడాకారులకు ఇదొక గుణపాఠం కావాలి’’ అని ట్వీట్ చేశారు. 

ఆటగాళ్ల రిటెయిన్‌ పద్ధతిలో బుమ్రాను ముంబయి అట్టిపెట్టుకోగా.. జాన్‌సెన్ మెగా వేలంలోకి వచ్చాడు. బుమ్రాతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ముంబయి మరోసారి జాన్‌సెన్‌ను కొనుగోలు చేస్తుందా? లేదా అనే వేచి చూడాలి. తన అరంగేట్రం సిరీస్‌లోనే టీమ్‌ఇండియా బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టి 19 వికెట్లను తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని