IND vs SA: కీలక పోరు.. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా.. భారత జట్టులోకి కొత్త ఆటగాడు..

రాంచీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. గెలిస్తేనే సిరీస్‌ పోరులో టీమ్‌ఇండియా నిలుస్తుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా సారథి కేశవ్‌ మహరాజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు.

Updated : 09 Oct 2022 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. గెలిస్తేనే సిరీస్‌ పోరులో టీమ్‌ఇండియా నిలుస్తుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా సారథి కేశవ్‌ మహరాజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. సౌతాఫ్రికా రెగ్యులర్‌ సారథి టెంబా బవుమా బదులు కేశవ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.

40 ఓవర్లకు కుదించిన తొలి వన్డేలో ఆఖరున పేలవమైన బౌలింగ్‌తోపాటు.. టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కెప్టెన్‌ శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఆరంభం ఇస్తేనే మిగతా బ్యాటర్లు పరుగులు చేయగలరు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్ ఠాకూర్‌ రాణించినా.. రన్‌రేట్‌ భారీగా పెరిగిపోవడంతో పరాజయం తప్పలేదు. 

మొదటి వన్డేలో తొలుత బౌలింగ్‌లోనూ 30 ఓవర్ల వరకు అద్భుతంగా వేసినా.. చివర్లో పట్టుసడలించడంతో క్లాసెన్‌, డేవిడ్ మిల్లర్‌ విజృంభించి దక్షిణాఫ్రికాకు మంచి స్కోరు అందించారు. సిరీస్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. తొలి వన్డేలో ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపించింది. దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం మరోసారి భంగపాటు తప్పదు. రాంచీ మైదానంలో పరుగుల రాక కష్టంగా ఉండే అవకాశం ఉందని పిచ్‌ రిపోర్టు చెబుతోంది. క్రీజ్‌లో కుదురుకొని ఆడితే మాత్రం మంచి స్కోరు సాధించే ఛాన్స్‌ ఉంటుంది. 


జట్ల వివరాలు: 

భారత్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, షహబాజ్‌ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌, అవేశ్ ఖాన్‌

దక్షిణాఫ్రికా: మలన్, డికాక్, రీజా హెండ్రిక్స్, ఐదెన్ మార్‌క్రమ్‌, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్‌ (కెప్టెన్), ఫోర్టైన్, కగిసో రబాడ, ఆన్రిచ్‌ నోకియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని